బొమ్మనహాల్ మండలం ఉద్దేహాళ్ ZP ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. శుక్రవారం మెగా PTM కు హాజరైన ఆయన విద్యార్థులతో పాటు నేలపై కూర్చొని భోజనం తింటూ వారితో ముచ్చటించారు. గతంలో ఎవరూ ఇక్కడ తినేవారు కాదని ఇప్పుడు సన్న భియ్యంతో వంట బాగా చేస్తున్నారని కడుపునిండా తినగలుగుతున్నామని విద్యార్థులు చెప్పారు. టెన్త్ ప్రిపరేషన్ ఎలా ఉంది అంటూ వారిని అడిగి తెలుసుకున్నారు.