పెబ్బేరు: భక్తిశ్రద్ధలతో బంజారా లు కనుమ పండుగ ఘనంగా ఘనంగా నిర్వహించారు
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం తాండాలో బంజారాజ వాసులు కనుమ పండుగను బుధవారం ఉదయం 11 గంటలకు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. నూతనంగా పండిన పంటలతో వంటలు చేసి నైవేద్యంగా తమ ఆరాధ్య దేవుళ్ళకు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. సంప్రదాయంగా వ్యవసాయ పనిముట్లు, గోమాతను పూజించారు. వారి కుటుంబ సమేతంగా ఆడపడుచులను పిలిపించుకొని మరి ఈ పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు