బాధితులు నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నిర్వహించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన 71 ఫిర్యాదిదారుల అర్జీలను ఎస్పీ మరియు పోలీస్ అధికారులు స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. అందిన ఆయా ఫిర్యాదులపై సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు