కొమరాజులంక పంచాయతీ నిధుల దుర్వినియోగం పై జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గ్రామస్తులు ఫిర్యాదు
మలికిపురం మండలం, కొమరాజులంక పంచాయతీ సెక్రటరీ ఏసుబాబు నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ సోమవారం గ్రామస్తులు అమలాపురం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ నిషాంతి కి ఫిర్యాదు చేశారు. దీనిపై వారు మాట్లాడుతూ గతంలో జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. కలెక్టర్ మహేశ్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో జేసీ నిషాంతి కి వినతిపత్రం సమర్పించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.