తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం పంచమి తీర్థం జరిగింది. కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, జెయివో వీరబ్రహ్మం తదితరులు హాజరయ్యారు. పూజల అనంతరం అందరూ కలిసి పుణ్యస్నానాలు చేసారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చి పద్మ పుష్కరినిలో స్నానమాచరించారు.