పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్ల క్వారీ దగ్గరఉన్నJNNURM కాలనీ సమీపంలో, ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ నేతృత్వంలో, పోలీస్ సిబ్బంది కార్డెన్ సెర్చ్ చర్యలను చేపట్టారు.సమాజంలో చట్టాన్ని పాటించే వాతావరణాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో, అక్రమ కార్యకలాపాలను గుర్తించి, ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.సెర్చ్ సందర్భంగా సరైన రికార్డులు లేకుండా నడుపుతున్న ఆరు వాహనాలను సీజ్ చేసారు మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించిన పప్పల గంగరాజు అనే వ్యక్తిపై కేసును నమోదు చేసి, అతని వద్ద ఉన్న 6 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.