రంగారెడ్డి జిల్లా హస్తినాపురం డివిజన్ నందనవనంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని తొలగించిన ప్రాంతాన్ని బిజెపి డివిజన్ అధ్యక్షుడు ఎరుకల మల్లేష్ గౌడ్ శనివారం సందర్శించారు. ఈ ఘటన జరిగి 48 గంటలు గడిచిన కార్పొరేటర్ సుజాత నాయక్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందించకపోవడం ఆందోళనకరమని విమర్శించారు. నందనవనంలో దేవాలయాలు పార్కులు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని అక్కడ పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.