తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు బుధవారం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణ రావు సినీ దర్శకుడు శైలేష్ కోలా వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.