ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను: ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్
మామిడికుదురు లో సొసైటీ చైర్మన్ ఈలి శ్రీనివాస్ స్వగృహం వద్ద పీఆర్టీయూ ప్రతినిధులు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ను కలిశారు. యాప్ ల భారం తగ్గించాలని, డీఏ ఎరియర్స్ విడుదల చేయాలని, పీఆర్సీ బకాయిలు ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమస్యలను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన ఉపాధ్యాయులకు తెలిపారు.