కాల పరిమితి జీవో రద్దు చేయాలి కాకినాడ డిఆర్డిఎ కార్యాలయం వద్ద యానిమేటర్ ధర్నా
కాకినాడ, DRDA ఆఫీస్ : యానిమేటర్ల మూడేళ్ల కాలపరిమితి జివోని రద్దు చేయాలని, బకాయి పెట్టిన మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని, పాడైన మొబైల్ స్థానంలో 5g మొబైల్స్ ఇవ్వాలని ఆన్లైన్ వర్క్ లు తగ్గించాలని, అక్రమంగా తొలగించిన వివోఏలను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ వివోఏ యనిమేటర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కాకినాడ జిల్లా డిఆర్డిఏ పిడి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిఆర్డిఏ పిడి శ్రీనివాస్ కి అందించారు.