వడగాలులు, డీహైడ్రేషన్ వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఈ దిశగా తీసుకోవలసిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర హోం మంత్రి వి.అనిత మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ తో పాటు డీఆర్వో బి.చిన ఓబులేసు, ఇతర అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు.