నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని ఇస్కాల గ్రామ సమీపంలోని పంప్ హౌస్ వద్ద చేపల వలలో ఒక కొండచిలువ చిక్కుకుంది, గుర్తించిన స్థానికులు ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు, ఇస్కాల గ్రామంలోని పంప్ హౌస్ కు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది కొండచిలువను వలలో నుంచి తప్పించి నల్లమల అటవీ ప్రాంతంలో కొండచిలువను వదిలేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు