అప్పనపల్లి బాలాజీని దర్శించుకున్న ఓఎన్జీసీ డిప్యూటీ డైరెక్టర్, వేద ఆశీర్వచనం అందజేసిన అర్చకులు
మామిడికుదురు మండలం, అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామిని మంగళవారం ఓఎన్జీసీ డిప్యూటీ డైరెక్టర్ డి.ఆర్.కణ్ణన్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన పేరిట స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు డిప్యూటీ డైరెక్టర్ కు శేష వస్త్రములతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేసారు.