గుమ్మగట్ట మండలం తాళ్ళకెర లో ప్రసిద్ధి చెందిన వీరభద్రస్వామి కార్తీక రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మద్యాహ్నం వేలాది మంది భక్తులు సమక్షంలో బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహించారు. ఆంద్ర, కర్నాటక ప్రాంతాల నుండి తరలి వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. మెట్టువిశ్వనాథ్ రెడ్డి, వీరబద్రారెడ్డి ప్రముఖులు పాల్గొన్నారు.