కాకినాడలో మేలుకో ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ పరిరక్షణ సమితి సమావేశం.. హాజరైన రాష్ట్ర నాయకులు రమేష్ పాట్నాక్
కాకినాడ నగరంలో మేలుకో ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ పరిరక్షణ సమితి సమావేశం ఆదివారం జరిగింది. రాష్ట్ర నాయకులు రమేష్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాకినాడ నగరానికి చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ సలహాలు సూచనలు ఇచ్చారు. గ్రామ మండల స్థాయిలో మేల్కో ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ పరిరక్షణ సమితిని ఏ విధంగా తీసుకువెళ్లాలి ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ పై అవగాహన ఏ విధంగా కల్పించాలని అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు, జవహర్ అలీ, అయితేబత్తుల రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.