భక్తజనసంద్రంగా మారిన :రామతీర్థం పుట్టాలమ్మ దేవస్థానం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం రామతీర్థం పుట్టలమ్మ దేవస్థానం ఆదివారం భక్త జనసంద్రంగా మారింది, మార్గశిర మాసం దశమి పర్వదినం సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు మాట్లాడుతూ.. సంతాన ప్రధాత అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అత్యంత మహిమాన్వితుడని పుట్టాలమ్మ ఆలయాన్ని దర్శించుకునే భక్తులకు సంతానం ఆయురారోగ్యాలు కలుగుతాయని తెలిపారు