పెందుర్తి: పెందుర్తిలో ఐఫోన్ కొని ఇవ్వలేదని మనస్థాపనతో యువకుడు ఆత్మహత్య
ఐఫోన్ కొనివ్వలేదని పెందుర్తి లో యువకుడు ఆత్మహత్య. పెందుర్తి సుజాతానగర్ లో నివాసం ఉంటున్న మృతుని తండ్రి చంద్రశేఖర్ స్థాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు.. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్ (26) కొంతకాలం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమలో పనిచేసి, ఇటీవలే ఇంటికి వొచ్చాడు. ఇక్కడికి వొచ్చిన దగ్గర నుండి తండ్రి చంద్రశేఖర్ ను ఐఫోన్ కొని ఇవ్వాలని అడిగేవాడు.ఈ ఫోన్ విషయమై ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.అనంతరం గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు..కెవిన్ బయటకురాకపోవడంపైఅనుమానంవచ్చినకుటుంబసభ్యులుతలుపునుబలవంతంగాతెరవడంతో ఫ్యాన్ కుఉరేసుకొనిఆత్మహత్యకు పాల్పడ్డాడు.