విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవి ప్రాణాలు కోల్పోయింది. రాయదుర్గం పట్టణంలోని మొలకల్మూరు రోడ్డులో గొల్లపల్లి రూటు మలుపు వద్ద గురువారం మద్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. నేలకు 3 అడుగుల ఎత్తు కూడా లేని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను మేత మేస్తూ వెళ్లిన గోవు ప్రమాదవశాత్తు తగిలి మృతి చెందింది. గోవు మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు అక్కడికి చేరుకుని విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.