గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి: తాళ్ళరేవు లో ఎంపీ గంటి హరీష్ మాధుర్
గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఆకాంక్షించారు. తాళ్ళరేవు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నూతన గదులను ఎంపీ ప్రారంభించారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పలు క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.