ఆంధ్రప్రదేశ్ సర్వేయర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన పీలేరు రెవిన్యూ డివిజన్ సర్వేయర్స్ కు ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు.స్థానిక రెవెన్యూ కార్యాలయం నందు పీలేరు మండల సర్వేయర్ రెడ్డిశేఖర్ , సంబేపల్లి మండల సర్వేయర్ హరికృష్ణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఎన్నికల నిర్వహణాధికారిగా మదనపల్లి డివిజన్ మాజీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు చక్రపాణి నాయుడు ఎన్నికల నిర్వహణ అధికారిగా వ్యవహరించి నూతన పీలేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పీలేరు,కె.వి పల్లి, కలకడ,గుర్రంకొండ, వాల్మీకిపురం, కలికిరి, సదుం, సోమల మండలాలలో పనిచేసే సర్వేయర్స్ తో కమిటీ చేశారు