లక్ష్మీవాడ లో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులు అవగాహన ర్యాలీ
కాట్రేనికోన మండలం, లక్ష్మీవాడ లో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై అవినాష్ మాట్లాడుతూ డ్రగ్స్ మత్తులో జీవితాలు నాశనం చేసుకోవద్దని, గంజాయి నిర్మూలనకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. డ్రగ్స్ రవాణా పై సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పోలీసులు పాల్గొన్నారు.