రాయదుర్గం పట్టణంలో చారిత్రక కోట ముఖద్వారం జీర్ణోదరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. పురావస్తు శాఖ అధికారులు శుక్రవారం మద్యాహ్నం పడిపోయిన కోట ముఖద్వారం శిథిలాలను JCB తో తొలగించే పనులు ప్రారంభించారు. పురావస్తు శాఖ ద్వారా రూ.70 లక్షలు జీర్ణోదరణ పనుల కోసం కేటాయించింది. తాజాగా పనులు ప్రారంభం కావడంతో పట్టణ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.