డి.హిరేహాల్ మండలం ఎం.హనుమాపురం లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆనంద్ కుమారుడు 8 ఏళ్ల మహేష్ గోడకూలి మీదపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. 3వ తరగతి చదువుతున్న మహేష్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కు వెళ్లి తిరిగి వచ్చిన కాసేపటికే ఈ విషాదకర సంఘటన జరిగింది.