పెందుర్తి: మహిళ కనిపించట్లేదని పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
పెందుర్తి పోలీస్ స్టేషన్లో విల్లూరు దేవి ఫిర్యాదు చేసిన ప్రకారంఆమె తల్లి మొల్లేటి వరలక్ష్మి (58),అయ్యప్పనగర్, పెందుర్తి వద్ద ఒంటరిగా నివసిస్తూ, శ్రీకాకుళం జిల్లా సోంపేటలో కేర్ టేకర్‌గా పనిచేస్తున్నారు.సుమారు 15 రోజుల క్రితం ఆమె డ్యూటీకి వెళ్లగా, తేది 17న ఆరోగ్యం బాగోలేక పెందుర్తి ఇంటికి వచ్చి, “ఆరోగ్యం బాగోలేదు KGH కి వెళ్తున్నాను, మీరు రండి అని ఫోన్లో చెప్పి వెళ్లారు. అప్పటినుంచి ఈ రోజు శుక్రవారం వరకు ఆమె ఆచూకీ తెలియడం లేదు. కుటుంబ సభ్యులు వెతికినాదోరకపోయేసరికి పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సిఐ సతీష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు