ఒంగోలు రైల్వే సీఐ మౌలా షరీఫ్ ఆధ్వర్యంలో, ఎస్.ఐ టీ. శ్రీరామ్ మరియు పోలీసు సిబ్బందితో కలిసి శనివారం రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫార్ములు, రైళ్లలో ప్రయాణికుల సామాను మరియు అనుమానాస్పద వ్యక్తులపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంజా వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే గంజాయి నివారణపై అవగాహన కల్పిస్తూ పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా నిర్వహించబడింది. గంజా మరియు ఇతర మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు కట్టబడి పనిచేస్తామని అన్నారు.