నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో హంద్రీనీవా పంప్ హౌస్ వద్ద ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఆదివారం పోలీసులు తెలిపారు, అతని వయస్సు సుమారు 35 సంవత్సరములు ఉంటాయని పేర్కొన్నారు, అతని వంటిపై ఆకుపచ్చ రంగు టీ షర్టు మరియు బ్లూ కలర్ జీన్స్ పాయింట్ వేసుకున్నాడని వివరించారు, హంద్రీనీవా పంప్ హౌస్ నీటిలో పడి ఉన్న మృతదేహాన్ని బయటికి తీసి బ్రాహ్మణకొట్కూరు పోలీసులు కేసు దర్యాప్తు నిమిత్తం కర్నూలు గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ లోని మార్చురీ తరలించారు, ఈ కార్యక్రమంలో మిడ్తూర్ ఎస్సై ఓబులేసు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు