ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలపై దాడుల్లో భాగంగా ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీ అధికారులు దాడి చేశారు. కార్యాలయంలో ఉన్న పలు రికార్డులను స్వాధీనం చేసుకొని ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి బాబురావు వద్ద అనధికారికంగా ఉన్న 10 వేల నగదు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడి చేశారు