విశ్వకర్మ జయంతి యజ్ఞోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: అమలాపురం లో ఓబీసీ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ మహాలక్ష్మి రావు
అమలాపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా ఓబీసీ మోర్చా సమావేశం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన అమరావతి ఉద్దండరాయుని పాలెంలో జరిగే విశ్వకర్మ జయంతి యజ్ఞోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ పి.మహాలక్ష్మి రావు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ జన్మదినోత్సవంతో పాటు విశ్వకర్మ జయంతి కార్యక్రమం "సృష్టి" అమరావతి రాజధాని భూమిపూజ స్థలంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.