నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని బ్రహ్మం గారి మఠం వద్ద శనివారం సాయంత్రం మిడ్తూరు ఎస్సై ఓబులేసు తమ సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు, అనంతరం ఎస్సై మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు, అదేవిధంగా మద్యం తాగి వాహన నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు, ఈ తనిఖీలలో ఓవర్ లోడ్ తో వెళ్తున్న హెల్మెట్ లేని వాహనాలకు జరిమానా విధించినట్లు ఎస్సై ఓబులేసు తెలిపారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు