రాయదుర్గం పట్టణంలోని నాన్ చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్లు సీజ్ చేసినట్టు ఎస్ఐ గొల్ల శ్రీరామ ప్రసాద్ తెలియజేశారు. సోమవారం ఉదయం తమకు రాబడిన పక్కా సమాచారంతో సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో తమ సిబ్బంది తనిఖీలు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్టేషన్ కు తరలించినట్లు వెల్లడించారు. తదుపరి చర్యల కోసం తహసీల్దార్ కు అప్పగించామన్నారు.