గోపాల్‌పేట: గోపాల్ పేట్ మండల కేంద్రంలో Sc బాలుర హాస్టల్ విద్యార్థి మృతి
వనపర్తి జిల్లా గోపాల్ పేట ఎస్సీ హాస్టల్లో భరత్ అనే 8వ తరగతి అబ్బాయి అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు హాస్టల్లో ఫిట్స్ రావడంతో విద్యార్థులు వనపర్తి హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే విద్యార్థి చనిపోయినట్లు వనపర్తి ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి సొంత గ్రామం గోపాల్పేట మండలం ఏదుట్ల.గ్రామం తల్లి ఉడుముల అరుణా తండ్రి వెంకటస్వామి.అయితే తండ్రి కూడా ఇటీవల నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు తాపీ పనిలో జారిపడి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు . బాధితుల తరఫునుంచి పలువురు విద్యార్థి సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా