అమలాపురం కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 250 అర్జీలు స్వీకరించిన అధికారులు
అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్ నందు సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి అధ్యక్షతన 260 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఖచ్చి తమైన స్పష్టత ఉండాలని ఆర్జీలు పునరావృతమైతే సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పూర్తి భాధ్యత వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో మాధవి, డ్వామా పిడి మధుసూదన్ ఇతర జిల్లా స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు