మిస్సింగ్ కేసులు, NBWలు, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పోలీస్ అధికారులను ఆరా తీసి, తగిన సూచనలు, సలహాలు తెలియజేసారు.మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఏవరైన తప్పిపోయారని లేదా కనిపించుటలేదని ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఫోటోని అన్ని పోలిస్టేషన్లకు పంపించి ట్రేస్ చేయుటకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయాలన్నారు