నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 32వ సేవా కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు,సేవా సమితి సభ్యులు భారీగా తరలివచ్చారు,ఈ కార్యక్రమంలో భాగంగా పారుమంచాల గ్రామానికి చెందిన బి. వెంకటేష్ (48 సం.) గత 9 ఏళ్లుగా కంటి చూపు లేక పడుతున్న బాధను గుర్తించిన సేవా సమితి,ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం సేకరించిన రూ. 20,000 (ఇరవై వేల రూపాయల) ఆర్థిక సాయాన్ని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రజ్వల చేతుల మీదుగా బాధిత కుటుంబ