పోరాట యోధుడు బొజ్జా తారకం: ముమ్మిడివరం తారకం వర్ధంతి కార్యక్రమంలో నాయకులు
ముమ్మిడివరంలో హైకోర్టు న్యాయవాది, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు బొజ్జా తారకం 9వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. తొలుత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, తారకం విగ్రహాలకు రాజ్యాంగ పరి రక్షణ సమితి అధ్యక్షుడు సుధీర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీడిత ప్రజల గొంతుక, మానవ హక్కుల ఉద్యమ నేత బొజ్జా తారకం అన్నారు. అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం తుదిశ్వాస వరకు పోరాడిన పోరాట యోధుడని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.