బనగానపల్లె రెవిన్యూ డివిజన్ ఏర్పాటుతో సమస్యల పరిష్కారం ; కొలిమిగుండ్లలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శివ నారాయణ
బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు శివనారాయణ, గోపాల్ గారి దస్తగిరి పేర్కొన్నారు. మంగళవారం BPL రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపట్ల హర్షం వ్యక్తం చేస్తూ కొలిమిగుండ్లలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి బీసీ జనార్దన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఆంజనేయ, కొండచంద్ర, మోహన్ పాల్గొన్నారు.