గోపాల్పేట: బైక్ ఎదురు రావడంతో కల్వర్టులోకి
కారు
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలంలోని తాడిపర్తిలో త్రుటిలో ప్రమాదం తప్పింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీరంగాపురానికి చెందిన మొగులయ్య మద్యం తాగి బైకుపై గోపాల్ పేట నుంచి వనపర్తికి వెళ్తన్నారు. వనపర్తి నుంచి గోపాల్ పేట వైపు వెళ్తున్న కారుకు ఎదురుగా బైక్ రావడంతో కారును పక్కకు మళ్లించే క్రమంలో ప్రమాదవశాత్తు కల్వర్టులో పడిపోయింది. ఘటనలో కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. మొగులయ్యకు గాయాలు కావడంతో వనపర్తి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు