దుండగుల దుశ్చర్యలో కణేకల్లు మండల కేంద్రంలోని బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం ధ్వంసమైంది. ఈ ఘటనకు నిరసనగా వైసిపి శ్రేణులు భగ్గుమన్నారు. శనివారం కణేకల్లు మండల కేంద్రంలో రాత్రి స్ధానిక పోలీసు స్టేషన్ వద్ద ఆ పార్టీ రాష్ట్ర ఎక్జిక్యూటివ్ మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి, మండల అధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి, కేశవరెడ్డి? మారెన్న ల ఆధ్వర్యంలో వందలాది మంది స్థానిక పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. అనంతరం పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే ధనుంజయ అనే వ్యక్తి ని అరెస్ట చేసినట్లు ఎస్ఐ తెలిపారు.