కుప్పం: కుప్పంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి
కుప్పం పట్టణంలోని TDP ఆఫీసులో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నివాళులర్పించారు. సమాజంలో సమానత్వం, విద్యా ప్రబోధం, మహిళా సాధికారతతో పాటు అణగారిన వర్గాల హక్కుల కోసం నిస్వార్ధంగా పోరాడిన మహానుభావుడు ఫూలే అని MLC కొనియాడారు.