కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించాలి... సిపిఎం నగర కమిటీ కన్వీనర్ వీరబాబు డిమాండ్
కాకినాడ నగరపాలక సంస్థకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం నాగర్ కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం కాకినాడ సినిమా రోడ్ లో గల నగర పాలక సంస్థ పాత కార్యాలయం వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌కు ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ధర్నా... వర్షంలో సైతం సిపిఎం నాయకులు తడుస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ వీరబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్పొరేషన్ కు ప్రత్యేక అధికారి పాలన నేటికీ మూడేళ్లు పూర్తికావస్తుందని తక్షణమే కార్పొరేషన్‌కు ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.