19న చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి వైసిపి యువజన విభాగ జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్ పిలుపు
జగన్ గారు పేదల వైద్య విద్య కలను సాకారం చేయడంతో పాటు, పేదలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సుమారు రూ.8,500 కోట్లతో ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ కాకినాడ జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ బన్నీ తెలిపారు. బుధవారం ఉదయం కాకినాడ నగరం నుండి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువజన విభాగ నాయకులు మాజీ కార్పొరేటర్లు కిషోర్ ,రోకల సత్యత కలిసి రాగిరెడ్డి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.