కర్నూలు సమీపంలో బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై మరో బస్సు ప్రమాధం జరిగింది. అయితే తృటితో ప్రాణాపాయం తప్పింది. రాయదుర్గం నుండి హైదరాబాద్ కు వెళుతున్న మాధవి ట్రావెల్స్ ఏసి బస్సు శనివారం అర్ధరాత్రి తర్వాత రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును డీకొన్నది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు ద్వంసం అయ్యాయి. ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. 26 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరినట్లు తెలుస్తోంది