ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేల కంటే షాడో ఎమ్మెల్యేల నియోజకవర్గాన్ని శాసిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కుటుంబ సభ్యులు మరికొన్ని చోట్ల ముఖ్య నేతలు ఎమ్మెల్యేలకు షాడోలుగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గంలో వీళ్ళు చెప్పిందే వేదంలా జరుగుతోంది వీళ్ళు చెప్పనిదే ఏ ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైలు కదలవట ఈ షాడో ల తీరుతో కూటమి కార్యకర్తలే విసిగిపొందుతున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.