చిత్తూరు జిల్లాలో 15,75,899 మంది ఓటర్లు ఉన్నారని చిత్తూరు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ ప్రక్రియ ద్వారా బోగస్ మరణించిన వారిని జాబితా నుంచి తొలగించే పారదర్శకమైన ఓటర్ జాబితా రూపొందించవచ్చు అన్నారు.