రాయదుర్గం పట్టణం మొలకల్మూరు రోడ్డు చెక్ పోస్టు సమీపంలో 2 బైక్ లు డీకొన్న ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పైతోట ఏరియాకు చెందిన బొమ్మయ్య, శేఖర్ బైక్ పై పట్టణానికి వస్తుండగా రాము, సుంకన్న అనే ఇద్దరు మరో బైక్ పై ఎదురుగా రావడంతో పరస్పరం డీకొన్నాయి. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.