రాయదుర్గం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన కృషిని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బండికృష్ణమూర్తి పాల్గొన్నారు.