రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఆదివారం తెల్లవారుజామున కాలువపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డును బంద్ చేశారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సుమారు మూడు గంటల కు పైగా రోడ్డుపై నిరసన చేపట్టడంతో రాయదుర్గం నుండి అనంతపురం అలాగే అనంతపురం నుండి రాయదుర్గం వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.