ఆపరేషన్ “వజ్రప్రహార్” లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, టు టౌన్ సీఐ శ్రీనివాసరావు,9 మంది సబ్ డివిజన్ ఎస్సైలతో 50 మంది సిబ్బంది కలిసి శనివారం ఉదయంఒంగోలు టౌన్ లోని వంటవారి కాలనీ మరియు ఏకలవ్య కాలనీలో వజ్ర ప్రహర్ ఆపరేషన్ (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. తనిఖీలు ముఖ్యంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లు, దుకాణాలు, ఇతర ప్రదేశాలను తనిఖీలు నిర్వహించారు.సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 25 బైకు లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు