అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) బలోపేతం కావాలని జిల్లా ఇంఛార్జి ఆదిలక్ష్మి ఆకాంక్షించారు. అమలాపురం స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ ఆర్.సుశీల అధ్యక్షతన నూతన కమిటీ ఏర్పాటు జరిగింది. మహిళలు, విద్యార్థునులపై వేధింపులు, గృహహింస సమస్యల పరిష్కారానికి జిల్లాలో ఐద్వా మహిళా సంఘం కృషి చేయాలని ఆదిలక్ష్మి పిలుపు నిచ్చారు