స్వస్థ సశక్త్ పరివార్ అభియాన్ పోస్టర్ ఆవిష్కరించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ
“కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాల ద్వారా ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్న స్వస్థ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.”కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారుకాకినాడ గోదారిగుంటలో ఆయన నివాసంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ రత్నకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ పోస్టర్ను ఆవిష్కరించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ తదితరులు పాల్గొన్నారు